Dravid Counter to Gautam Gambhir | గంభీర్ కోచింగ్ విధానంపై ద్రవిడ్ ఫైర్ | ABP Desam

 టీమిండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ పని చేస్తున్న విధానంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది ఆటగాళ్ల కంటే క్రికెట్ ఎక్కువ అని...గంభీర్ ఆలోచనే సరైందనే అంటుంటే..మరికొంత మంది మాత్రం స్టార్ క్రికెటర్లు అంటే మండిపడే రోహిత్, కోహ్లీ లాంటి ఆటగాళ్ల కెరీర్ ను క్లోజ్ చేయాలనే ప్లాన్స్ తో ఉన్నాడంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కోచింగ్ స్టైల్ గురించి తన విధానం ఏంటో చెప్పాడు రాహుల్ ద్రవిడ్. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ అనే వ్యక్తి ఎలా ఉండాలో తన అభిప్రాయం చెప్పాడు. కోచ్ అంటే టీమ్ సెలెక్షన్ లో భాగస్వామ్యమై కొత్త తలనొప్పులు తెచ్చే కంటే సెలెక్ట్ అయిన టీమ్ నుంచి మంచి ఔట్ పుట్ తీసుకువచ్చి ఫలితాలు తీసుకురావటంలో కెప్టెన్ కి హెల్ప్ చేయటంపై ఎక్కువ దృష్టి సారించాలన్నాడు. తనకు తాను కెప్టెన్ రోహిత్ శర్మకు అలానే సహకరించే వాడినని చెప్పాడు. టీమ్ ఎలా ఉండాలి ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించటం లాంటి విషయాలు కోచ్ కంటే కెప్టెనే ఎక్కువగా ఆలోచిస్తాడు. రోహిత్ శర్మ ఈ విషయాలను చాలా కూల్ గా డీల్ చేసేవాడు. తను కెప్టెన్ అని అతి ఎక్కడా ప్రదర్శించే వాడు కాదు. అప్పుడు తను రోహిత్ శర్మ తెచ్చుకున్న టీమ్ నుంచి బెటర్ రిజల్ట్ ఎలా రప్పించాలన్న విషయాలపై దృష్టి సారించే వాడినని చెప్పాడు. ఎక్కడా గంభీర్ పేరు చెప్పకుండానే గంభీర్ చేస్తున్న పనులన్నింటినీ ప్రస్తావించిన ద్రవిడ్...ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను కౌంటర్ చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola