Divorce due to Cricket | క్రికెట్ కోసం భార్యనే వదులుకున్న పిచ్చోడు | Sports Tales | ABP Desam
మహ్మద్ షమి, శిఖర్ ధవన్ హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్.. వీళ్లంతా పెళ్లి చేసుకుని రకరకాల కారణాలతో వాళ్ల వాళ్ళ భార్యలతో విడాకులు తీసుకున్నారు. వీళ్లందరి విడాకుల న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అసలు వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారా..? అనే టాపిక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు వాళ్లకి అర్థమైన రీతిలో.. నచ్చిన స్టైల్లో.. ఇష్టం వచ్చినట్లు పుకార్లు కూడా పుట్టించారు. వేలు, లక్షల పోస్ట్‌లు షేర్ చేశారు. కానీ.. ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే.. వీళ్లలో ఒక్కరి డివోర్స్‌కైనాక్రికెట్ కారణంగా ఉందా? ఈ ప్రశ్న వినగానే.. అదేంటి? అసలు ఓ క్రికెటర్ లైఫ్‌లో క్రికెట్ కారణంగా ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా..? ఇదేం పిచ్చి ప్రశ్న? అని మీరనొచ్చు. కానీ వీళ్లెవరూ కాకపోయినా.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రికెటర్ మాత్రం.. క్రికెట్ వల్లే తన భార్యకి దూరమయ్యాడు.
హాయ్.. అండ్ వెల్‌కమ్ టూ స్పోర్ట్స్ టేల్స్. మనందరం చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకోవడానికి వెళుతుంటే మన అమ్మో, నాన్నో తిట్టి, కొట్టి చదువుకోవాలంటూ భయపెట్టి ఆపేసేవాళ్లు. అయినా మనం మన క్రికెట్ పిచ్చితో వాళ్ల కళ్లు కప్పి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లేవాళ్లం. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు నాలుగు పీకినా.. పట్టించుకోకుండా తెల్లారి మళ్లీ బ్యాట్ తీసుకుని సైలెంట్‌గా గ్రౌండ్‌కి వెల్లిపోతాం. ఇదంతా చిన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. కానీ పద్దై, పెళ్లైన తర్వాత కూడా ఇలాంటి పనులే చేస్తే.. క్రికెట్ పిచ్చితో ఫ్యామిలీని పట్టించుకోవడం మానేస్తే.. ఇంగ్లండ్‌కి చెందిన మైకెల్ రౌలీ పరిస్థితిలానే తయారవుతుంది మన పరిస్థితి కూడా.
1964లో మైకెల్ రౌలీ, మిల్‌డ్రెడ్‌లకి పెళ్లైంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి రోజునే మైకెల్.. తన భార్య మిల్‌డ్రెడ్‌కి ఓ కండిషన్ పెట్టాడు. అదేంటంటే.. తనకి అన్నింటికంటే ముందు క్రికెట్.. ఆ తర్వాతే ఏదైనా. ఈ కండిషన్‌కి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ మాట విని.. తన భర్తకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అర్థం చేసుకున్న మిల్‌డ్రెడ్.. అతడి ఇష్టాన్ని గౌరవిస్తూ ఓకే చెప్పింది. ఇద్దరికీ పెళ్లైంది. కానీ ఆ టైంలో ఆమెకి మెకెల్ క్రికెట్ పిచ్చి గురించి పూర్తిగా తెలిసి ఉంటే.. మే బీ పెళ్లికి ఒప్పుకునేది కాదేమో. ఈ విషయం రాను రాను మిల్‌డ్రెడ్‌డి అర్థం కావడం మొదలైంది. ఉదయాన్నే లేచి కాసేపు భర్తతో నవ్వుతూ కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే.. పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ చాలా సీరియస్‌గా అందులో మునిగిపోయి ఉండేవాడు మైకెల్. సరే రాత్రి టైంలో భోజనం చేసేటప్పుడైనా కొద్ది సేపు ఇంటి విషయాలు మాట్లాడుకుందాం అనుకుంటే.. రేడియోలో ఆ రోజు జరిగిపోయిన క్రికెట్ మ్యాచ్‌పై వస్తున్న కామెంటరీ చాలా ఫోకస్‌డ్‌గా వింటూ కూర్చునేవాడు. ఆదివారం సరదాగా అలా షికారుకెళ్దాం అంటే.. ఆమె నిద్రలేచేటప్పటికే మైకెల్ లేచి.. క్రికెట్ కిట్ తీసుకుని గ్రౌండ్‌కి వెళ్లిపోయేవాడు. ఆమె జీవితం మొత్తం ఇలాగే గడిచిపోయింది. ఇక చివరికి ఈ జివితంతో విసుగొచ్చి.. 1981, ఆగస్టులో తనకి తన భర్తతో డివోర్స్ కావాలని కోర్టుకెక్కింది మిల్‌డ్రెడ్. అంటే 17 ఏళ్ల పాటు తన భర్తలో మార్పొస్తుందని వెయిట్ చేసి చేసి.. చివరికి అలసిపోయి కోర్టు మెట్లెక్కిందన్నమాట.
కేసు మొదట్లో జడ్జిలు కూడా ఈ కేసు విడాకుల వరకు వెళ్లకుండా సర్దుకుంటుందిలే అనుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ.. మిల్‌డ్రెడ్ తను 17 ఏళ్లుగా పడుతున్న బాధని కోర్టుకు డీటెయిల్డ్‌గా వివరించడంతో జడ్జిలు కూడా షాకై వెంటనే ఇద్దరికీ డివోర్స్ ఇచ్చేశారు. 1981, ఆగస్ట్ 25న ఒకపక్క అంతకుముందు జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇయాన్ బాథమ్ తన బుల్లెట్లలాంటి బంతులతో బాబ్ విల్లిస్‌ని ఎలా ఇబ్బంది పెట్టాడో చెప్పే హెడ్‌లైన్స్‌తో పాటు ‘భర్త క్రికెట్ పిచ్చితో 17 ఏళ్లు బాధపడిన భార్య డివోర్స్ కోసం కోర్టుకెక్కింది.. కోర్టు డివోర్స్ ఇచ్చేసింది’ అనే హెడ్‌లైన్స్ కూడా న్యూస్ పేపర్లలో కనిపించాయి. అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్‌గా కూడా మారింది. క్రికెట్ ప్రేమికులు చాలామంది మిల్‌డ్రెడ్‌ని తప్పుబడితే.. మహిళల్లో మాత్రం చాలామంది ఆమెకి సపోర్ట్‌గా నిలబడ్డారు. అయితే ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటో తెలుసా..? కోర్ట్ మైకెల్, మిల్‌డ్రెడ్లకి డివోర్స్ అప్రూవ్ చేసిన సాయంత్రమే మైకెల్.. టోర్కేలో క్రికెట్ ఆడుతున్న తన ఫేవరెట్ టీమ్ వోర్‌సెస్టర్‌షైర్ మరాడర్స్ మ్యాచ్ చూడటానికి వెళ్లిపోయాడు. చాలా జాలీగా పేపర్, పెన్ను తీసుకుని స్కోర్ రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ‘అదేంటయ్యా..? నీ భార్య డివోర్స్ ఇచ్చింది కదా? బాధగా లేదా?’ అని అడిగితే.. ‘నేను ఆమెకి ముందే చెప్పా. నాకు క్రికెట్ తర్వాతే ఏదైనా అని. ఆమె సరేనని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భరించలేక వెళ్లిపోయింది. దానికి నేనేం చేయను?’ అని రిప్లై ఇచ్చాడు. ఈ ఆన్సర్ విని ప్రశ్న అడిగిన వాళ్లే షాకైయ్యారట.
ఏది ఏమైనా క్రికెట్ అంటే పిచ్చి ఉండొచ్చు కానీ.. మరీ ఇంత కుటుంబాలని నాశనం చేసే పిచ్చి ఉండకూడదు. మరి మీలో కూడా ఇంత క్రికెట్ పిచ్చోళ్లు ఎవరైనా ఉంటే కొద్దిగా తగ్గించుకోండి.