Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam

Continues below advertisement

 మీకు గుర్తుంటే...ఛాంపియన్స్ ట్రోఫీ 2026ను  భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు కొంత మంది పాక్ సానుభూతిపరులు, మాజీ క్రికెటర్లు, భారత్ అంటే అక్కసు వెళ్లగక్కే వాళ్లు ఏడ్చిన ఏడుపు ఏంటంటే భారత్ తన మ్యాచ్ లన్నీ దుబాయ్ లో పెట్టించుకుంది. ఐసీసీ ని బీసీసీఐ హ్యాండిల్ చేస్తోంది కాబట్టి వాళ్లకు నచ్చినట్లుగా పిచ్ లు సెలెక్ట్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుందని. మిగిలినజట్లు అటు పాక్ లో మ్యాచ్ లు ఆడి..మళ్లీ ఇటు దుబాయ్ కి వచ్చి భారత్ తో మ్యాచ్ లు ఆడాయని..అదే భారత్ కి అడ్వాంటేజ్ గా మారిందని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లు పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు దీన్నే గట్టిగా క్వశ్చన్ చేశాడు దినేశ్ కార్తీక్. స్కై స్పోర్ట్స్ కి కామెంటేటర్ గా చేస్తున్న దినేశ్ కార్తీక్...మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లు కో కామెంటేటర్స్ గా దొరికారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడేమో డిస్కషన్ మొదలుపెట్టాడు కార్తీక్. నేను ఈ సారి పాకిస్తాన్ కచ్చితంగా సెమీస్ కి వస్తుందనుకున్నా..శ్రీలంక కూడా రావాలి..కానీ ఎందుకో రాలేదు అన్నాడు దినేశ్ కార్తీక్. అథర్టన్, నాసిర్ హుస్సేన్ లు ఏం గుర్తు లేనట్లు ఎందుకలా అని అడిగితే...మీ ఫాజిల్స్ ఇద్దరే ఇండియా మీద ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు ఏడ్చారు. అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే ఆడి గెలిచారు అని ఇప్పుడు లంక హోం అడ్వాంటేజ్ లో ఆడింది...పాకిస్తాన్ అయితే మ్యాచ్ లన్నీ లంకలోనే ఆడింది. మరి ఆ రెండు జట్లు ఎందుకు ఒకే పిచ్ మీద ఆడినా కూడా వరల్డ్ కప్ లో సెమీస్ కి రాలేదు అని అడిగాడు. నెత్తుటి చుక్క లేకుండా పోయింది ఆ పంచ్ కి అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు . భారత్ మీద వాగిన వాగుడును దినేశ్ కార్తీక్ లైవ్ లో క్వశ్చన్ చేయటం ఒకటైతే ఇద్దరినీ శిలాజాలు అనటం తిరుగులేని మాకరీ అంటూ డీకే విటీనెస్ కి పేట్రియాటిజం కి సెల్యూట్ కొడుతున్నారు ఇండియన్ క్రికెట్ లవర్స్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola