David Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP Desam
హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యంగ్ హీరోయిన్ శ్రీ లీల మరో సారి నితిన్ కి జోడిగా ఈ సినిమాలో నటించింది. మార్చ్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించారని చెప్పేసారు మూవీ టీం. కానీ ఎదో మూవీ ప్రొమోషన్స్ కోసం ఇలా అంటున్నారని అందరు ఊహించారు. అయితే ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమాలు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. తెలుగు పాటలకి తన పిల్లలతో కలిసి రీల్స్ చేస్తూ తెలుగు సినిమా ఫ్యాన్స్ కి దెగ్గరవుతూనే ఉన్నారు. వార్నర్ సినిమాలోకి వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎంతో ఆశ పడ్డారు కూడా. వాళ్లు ఆశ పడ్డట్టుగానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసారు. వెల్కమ్ డేవిడ్ వార్నర్ టు ఇండియన్ సినిమా అని పోస్టర్ రిలీజ్ చేసారు రాబిన్ హుడ్ టీం.
ఇప్పుడందరూ ఈ సినిమాలో వార్నర్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఏంటన్న సందేహంలో పడిపొయ్యారు. తమ అభిమాన క్రికెటర్ బిగ్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తాడో చూడడానికి భారీగా ఎక్సపెక్టషన్స్ పెంచుకుంటున్నారు. హీరో నితిన్ కి కొంతకాలంగా హిట్స్ లేవు. రాబిన్ హుడ్ పై బానే ఆశలు పెట్టుకున్నారు. క్లీన్ కామెడీ సినిమాతో మీ ముందుకు వస్తున్నామంటూ జనాల్లో బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి మరి డేవిడ్ వార్నర్ వల్ల అయినా నితిన్ సినిమా చూడడానికి థియేటర్స్ కి జనాలు వస్తారో లేదో.