Chahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP Desam
క్రికెటర్ చాహల్, డాన్సర్ ధనశ్రీ వర్మ లవ్ స్టోరీ గురించి మనందరికీ తెలుసు. లాక్ డౌన్ టైంలో వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొనాలకి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ వర్మ ప్రొఫెషనల్ డాన్సర్. వీరి పెళ్లి తర్వాత ధరాశ్రీ RCB టీం సాంగ్ కి కూడా కొరియోగ్రాఫర్ గా చేసారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ధనశ్రీ తన భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూనే ఉండేది. బయట ఇద్దరు కలిసి కనిపించకపోయినా తన భర్తని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ పోస్టులు పట్టేది.
ఎం అయిందో తెలియదు. కొనాలకి వీళ్లిద్దరు విడిపోతున్నారని ఒక వార్త బయటకి వచ్చింది. అందుకు కారణం ధనశ్రీతో డాన్స్ చేసే మరో కొరియోగ్రాఫర్ అని కూడా అప్పట్లో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. కానీ ఆ తర్వాత కూడా చాహల్ టి 20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయినప్పుడు, తిరిగి ఇండియా వచ్చాక కూడా తన భర్తని పొగుడుతూ పోస్ట్ పెట్టింది.
ఈ కొన్ని నెలల గ్యాప్ లోనే వీళ్లిద్దరు ముంబై ఫ్యామిలీ కోర్ట్ లో డివోర్స్ కి అప్లై చేసారు. కోర్ట్ డివోర్స్ మంజూరు చేసింది కూడా. చాహల్ ధనశ్రీకి 4 కోట్ల 75 లక్షల భరణం ఇవ్వాలని కోర్ట్ నిర్ణయించింది. ఇక్కడ వరకు బానే ఉంది. ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలయ్యింది. వీళ్లిద్దరు కూడా ఒకరిపై మరొకరు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేసుకున్నారు.
డివోర్స్ కోసం కోర్ట్ కి వెళ్తున్నప్పుడు చాహల్ తన మొహం మాత్రమే కనిపించేలా జాకెట్ వేసుకొని వెళ్ళాడు. బయటకి వచ్చేటప్పుడు నార్మల్ గా జాకెట్ చేత పట్టుకొని వచ్చాడు. అయితే చాహల్ వేసుకున్న టీ షర్ట్ అందర్నీ ఆకర్షించింది. ఆ టీ షర్ట్ కాస్ట్, లేదా బ్రాండ్ కాదు.. దానిపై రాసి ఉన్న ఒక చిన్న సెంటెన్స్ అందర్నీ అట్ట్రాక్ట్ చేసింది. ఆ టీ షర్ట్ పై be your own sugar daddy అని రాసి ఉంది. దాని అర్థం ఏంటంటే ఎవరిపై డిపెండ్ అవకుండా నిన్ను నువ్వు పోషించుకోవాలని అర్థం. ధనశ్రీ భరణం అడిగినందుకే చాహల్ ఆలా టీ షర్ట్ వేసుకొచ్చాడని, డివోర్స్ తర్వాత కూడా చాహల్ పై డిపెండ్ అవడమేంటని చాహల్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.