Bumrah not Playing Second test | రెండో టెస్టులో బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ లేదా అర్ష్ దీప్ | ABP Desam

 ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ లో మన బౌలర్లు తేలిపోయారు. ఒక్క బుమ్రా మినహాయించి ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో మనోళ్లు ఆరు పరుగులు లీడ్ సాధించారు. బుమ్రా 5 వికెట్లు తీస్తే మిగిలిన బౌలర్లు బౌలర్లను నానా తంటాలు పడి ఔట్ చేసి మద్దతునిచ్చారు. కానీ రెండోసారి భారత్ ఇంగ్లండ్ ను కట్టడి చేయలేకపోయింది. 371పరుగుల టార్గెట్ ను నాలుగో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తో కొట్టించుకుని విజయాన్ని వారి చేతుల్లో పెట్టేసింది. ఫోర్త్ ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం మన మీద ప్రభావాన్ని చూపించింది. లీడ్స్ సంగతే అలా ఉంటే ఇప్పుడు రెండో టెస్ట్ జరగబోయే ఎడ్జ్ బాస్టన్ లో అసలు బుమ్రా ఆడడు అంటున్నారు. ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ నిన్న ప్రాక్టీస్ లో బుమ్రా పాల్గొనకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా కి బదులుగా ఆకాశ్ దీప్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరిని టీమ్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకాశ్ దీప్ ఇప్పటి వరకూ 7టెస్టులు ఆడగా 15వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తుండటం అర్ష్ దీప్ సింగ్ కి అడ్వాంటేజ్ కాగా అతని లెఫ్టార్మ్ పేస్ వేరియేషన్ ఎడ్జ్ బాస్టన్ లో ఉపయోగపడుతుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే అర్ష్ దీప్ టెస్టుల్లో డెబ్యూ చేయొచ్చు. మరో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలనే డిమాండ్ పెరుగుతోంది. స్పెషలిస్ట్ ఆల్ రౌండర్ అయిన NKR ఆస్ట్రేలియా సిరీస్ లో సెంచరీ కొట్టగా అతన్ని ఇంగ్లండ్ లో మొదటి టెస్టుకు పక్కన పెట్టడం కోచ్ గంభీర్ పై విమర్శల దాడి జరిగేలా చేసింది. చూడాలి గంభీర్, శుభ్మన్ గిల్ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో. కానీ ఒక్కటి మాత్రం నిజం బుమ్రా ఉంటేనే ఊతకొట్టుడు కొట్టారు. ఇక బుమ్రా లేకపోతే మన పరిస్థితి ఏంటో..మన బౌలింగ్ దళాన్ని సిరాజ్ మియా ఎలా నడిపిస్తాడో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola