Breaking News | Ishan Kishan Double Century: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్ | ABP Desam
యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన 3వ వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు. తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు. భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్ గా రికార్డు సాధించాడు. బంగ్లా బౌలర్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయిన ఇషాన్..... 126 బాల్స్ లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు కైవసం చేసుకున్నాడు. క్రిస్ గేల్ ను అధిగమించాడు. భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్. డబుల్ సెంచరీ సాధించేటప్పటికి 23 ఫోర్లు 9 సిక్సులు కొట్టాడు.
Tags :
Rohit Sharma Chris Gayle Telugu News Ishan Kishan ABP Desam IND Vs BAN Ishan Kishan Records Ishan Kishan Batting