Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
మొట్టమొదటి మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ ను గెలుచుకుని భారత మహిళల అంధుల క్రికెట్ టీమ్. ఈ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఫైనల్లో నేపాల్ ను 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టోర్నమెంట్ అంతటా భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా టైటిల్ సాధించింది.
అంధుల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి నేపాల్ ... 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఖులా శరీర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి భారత్ ను గెలిపించింది.
ఈ టోర్నమెంట్ లో లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియాను 209 పరుగుల తేడాతో ఓడించింది టీమ్ ఇండియా. అలాగే పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించారు మన అమ్మాయిలు. ఇక ఫైనల్లో నేపాల్ ను 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు ఓడించింది. అంధుల క్రికెట్ తొలి టీ20 వరల్డ్ కప్ మొదటి ప్రయత్నంలోనే భారత మహిళలు అద్భుతం చేశారు. అజేయంగా నిలవడంతో పాటు టైటిల్ గెలిచి దేశం గర్వించేలా చేశారు.