BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

Continues below advertisement

భారత్‌తో గొడవ బంగ్లా క్రికెట్‌ బోర్డుకు ఊహించని నష్టం కలిగించేలా కనిపిస్తోంది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను పంపించేశారనే కోపంతో టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌ వచ్చేది లేదని బీసీబీ అనౌన్స్ చేసింది. అలాగే ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బీసీబీకి మాత్రం వేల కోట్ల నష్టం వాటిల్లబోతోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ క్రికెట్ బోర్డులే భారత్‌ తమ దేశంలో టూర్ చేయాలని కోరుకుంటాయి. ఇది ఆ దేశాలకి వందల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది. మరి బీసీబీ నిర్ణయంతో భారత్‌తో మ్యాచ్‌లు ఉండకపోతే నష్టం బంగ్లాదేశ్ క్రికెట్‌కే కదా? ఇక ఐపీఎల్‌లో ఒకప్పుడు బంగ్లా ఆటగాళ్లు షకిబ్, ముస్తాఫిజుర్ లాంటివాళ్లు ఆడారు. బీసీబీ రూల్స్ ప్రకారం.. బయట టోర్నీలు ఆడే క్రికెటర్స్ వాళ్ల ఆదాయంలో 10 శాతం బీసీబీకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ ఆదాయం పోయినట్లే. అంతేకాదు.. ఐపీఎల్ ఓనర్లకు ఇంకా ఎన్నో విదేశీ టోర్నీల్లో టీమ్స్ ఉన్నాయి ఆ టీమ్స్‌లో కూడా బంగ్లా క్రికెటర్లని బ్యాన్ చేస్తే.. బంగ్లా క్రికెట్టే పూర్తిగా దెబ్బతింటుంది. ఒకవేళ బీసీబీ నిర్ణయంతో బీసీసీఐ సీరియస్ అయి.. పాకిస్తాన్‌లానే బంగ్లాదేశ్‌తో కూడా ఇకపై మేం టోర్నీలు, ఆడేది లేదని ప్రకటిస్తే.. ఇక బంగ్లా క్రికెట్ పరిస్థితేంటి? మరి ఇవన్నీ బీసీబీ ఆలోచించుకోలేదా? అనేదే ఎక్స్‌పర్ట్స్ మాట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola