BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam

ఐపీఎల్ ప్రారంభోత్సవానికి ఇక జస్ట్ నాలుగు రోజులే మిగిలి ఉంది. అయితే ఈ టైమ్ లో బీసీసీఐ సరికొత్త ఆంక్షలతో ఆటగాళ్ల ముందు టీమ్స్ మేనేజ్మెంట్ ముందు కొత్త రూల్స్ ను తీసుకురావటం సంచలనంగా మారింది. మార్చి 28న ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ తో ఐపీఎల్ ప్రారంభం కానుండగా..బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది.  మొదటిది మ్యాచ్ జరిగే రోజున జట్లు మైదానంలో ప్రాక్టీస్ చేయకూడదు. ఇది సరికొత్త రూల్ అని చెప్పాలి ఎందుకంటే మ్యాచ్ మొదలయ్యే ముందు వార్మప్ చేయటం...సాయంత్రం మ్యాచ్ అయితే ఉదయం కాసేపు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయటం లాంటి ఆటగాళ్లు చేస్తారు. కానీ బీసీసీఐ ఇకపై వద్దు అంటోంది. పిచ్ మరియు అవుట్‌ఫీల్డ్ దెబ్బతినకుండా ఉండటానికి, అలాగే ఆట సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఇక రెండోది ప్రాక్టీస్ కోసం ప్రతి జట్టుకు కేవలం రెండు నెట్స్ మాత్రమే కేటాయించాలని. ప్రత్యర్థి జట్టుకు కేటాయించిన నెట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ, ఇతర జట్లు వాటిని ఉపయోగించడానికి వీల్లేదని రూల్ పాస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఏ జట్టుకూ అదనపు ప్రయోజనం కలగకుండా, పోటీ సమానంగా ఉండాలనేది ప్లాన్. మూడోది ఫిట్‌నెస్ పరీక్షలపై పరిమితులు. మ్యాచ్ జరిగే రోజున ఆటగాళ్లకు ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది బీసీసీఐ. ఎందుకంటే అప్పటికప్పుడు ప్లేయర్లను మార్చుతూ ఫ్రాంచైజీలు అడ్వాంటేజ్ ను పొందుతున్నాయనేది ఆరోపణ. సో ఈ మూడు కొత్త రూల్స్ ను ఈ ఐపీఎల్ నుంచే అమలు చేయనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ఈ అంతర్గత సమాచారం అన్ని మేనేజ్మెంట్లకు పాస్ చేసినట్లు తెలుస్తోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola