Australia vs Scotland Match | T20 World Cup 2024 లో ఆసీస్ మెడపై వేలాడుతున్న కత్తి | ABP Desam

Continues below advertisement

 ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్ వుడ్ నోరు జారాడు. ఇంగ్లండ్ ను క్రికెట్ అతిపెద్ద శత్రువుగా భావించే ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి వాళ్లను ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేయొచ్చు అని చెప్పాడు. వరల్డ్ కప్ ఆడుతున్న హేజిల్ వుడ్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావటంతో ఇంగ్లండ్ సైతం అప్రమత్తమై ఐసీసీకి ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేటర్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో గ్రూప్ బీ లో ఆడుతున్నాయి ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లండ్ జట్లు. ఆస్ట్రేలియా 3కు 3 మ్యాచ్ లు గెలిచి సూపర్ 8 కి అర్హత సాధించింది. కానీ ఇంగ్లండ్ కి స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవటం భారీ దెబ్బ కొట్టింది.  ప్రస్తుతం స్కాట్లాండ్ మూడు మ్యాచుల్లో 5 పాయింట్లు సాధిస్తే..ఇంగ్లండ్ మూడు మ్యాచుల్లో మూడు పాయింట్లతో ఉంది. స్కాట్లాండ్ కి ఆఖరి మ్యాచ్  ఆస్ట్రేలియాతో ఉంటే..ఇంగ్లండ్ కి ఆఖరి మ్యాచ్ నమీబియాతో ఉంది. సో ఇంగ్లండ్ నమీబియా మీద గెలిస్తే చాలు స్కాట్లాండ్ కంటే మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి స్కాట్లాండ్ ను వెనక్కి నెట్టి సూపర్ 8 ఇంగ్లండ్ అర్హత సాధిస్తుంది. కానీ ఇక్కడే ఆస్ట్రేలియా తమ ప్లాన్ ఏంటో చెప్పింది. స్కాట్లాండ్ కి కావాల్సిన రిజల్ట్  ని ఇచ్చేలా ఆస్ట్రేలియా ట్రై చేయొచ్చు అన్నాడు. అంటే ఇన్ని పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మీద స్కాట్లాండ్ గెలవాలని ఓ రిజల్ట్ ఉంటుంది కదా అది స్కాట్లాండ్ కు దక్కేలా ఆసీస్ మ్యాచ్ కావాలనే ఓడిపోవచ్చు. ఫలితంగా స్కాట్లాండ్ సూపర్ 8 కి వచ్చి ఇంగ్లండ్ ఎలిమినేట్ అవుతుంది. దీనిపైనే ఇప్పుడు ఇంగ్లండ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.11 ప్రకారం వరల్డ్ గ్రూప్ స్టేజ్ లో ఏదైనా టీమ్ మిగిలిన టీమ్స్ స్టాండింగ్స్ ప్రభావితం చేసేలా కావాలనే మ్యాచ్ ల్లో ఇన్ అప్రాప్రియేట్ స్ట్రాటజీస్ కానీ టాక్టిక్స్ కానీ ప్రయోగిస్తే ఆ టీమ్ కెప్టెన్ పై రెండు మ్యాచుల నిషేధం పడుతుంది. అయితే ఆస్ట్రేలియా ఆ స్థాయికి దిగజారి తమ కెప్టెన్ మిచ్ మార్షన్ ను రెండు సూపర్ 8 మ్యాచులు కోల్పోతుందా...ప్యాట్ కమిన్స్ ఎలాగో డగౌట్ లో కూర్చుంటున్నాడు కాబట్టి కమిన్స్ కెప్టెన్ గా తిరిగి వస్తాడా..ఏం జరుగుతుందో తెలియదు కానీ రేపు జరగబోయే స్కాట్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ మీదే అందరి దృష్టీ ఉంది. ప్రత్యేకించి ఇంగ్లండ్ దృష్టి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram