Australia Failure reasons T20 World Cup 2026 | ఆస్ట్రేలియా కొంప ముంచింది ఆ ముగ్గురు పేసర్లే | ABP Desam

 మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్. ఈ పేస్ త్రయం దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ను రూల్ చేస్తోంది. ఎన్నో చారిత్రక విజయాలను అందించి ఆసీస్ వైభవాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్లిన మోడ్రన్ డే లెజెండ్స్ వీళ్ల ముగ్గురూ. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చూస్తే చాలు వీళ్లు ముగ్గురు ఆ టీమ్ కి ఎంత బ్యాక్ బోనో అర్థమైపోతుంది. ఫైనల్ వరకూ వరల్డ్ కప్ లో ఓటమి అనేదే తెలియకుండా దూసుకొచ్చిన భారత్ ను 240 పరుగులకే ఆలౌట్ చేశారు ఈ ముగ్గురూ. స్టార్క్ 3 వికెట్లు తీసుకుంటే హేజిల్ వుడ్, అప్పటి కెప్టెన్ కమిన్స్ 2 వికెట్లు తీసుకుని...భారత్ నుంచి వరల్డ్ కప్ ను ఊహించలేని విధంగా లాగేసుకున్నారు. ఇదనే కాదు అది యాషెస్ టెస్ట్ సిరీస్ అయినా..టీ20 వరల్డ్ కప్ లు అయినా ఈ ముగ్గురే పేస్ త్రయం. ఇదేమైపోయిందంటే మరో పేసర్ మరో రిజర్వ్ బెంచ్ లేకుండా పోయింది ఆస్ట్రేలియాకు. టెస్టుల్లో అన్నా బోలండ్ లాంటి పేసర్ బ్యాకప్ ఉంది కానీ వైట్ బాల్ క్రికెట్లో గల్లంతైపోయింది ఆ టీమ్ బౌలింగ్ బెంచ్. స్పిన్ బౌలింగ్ లోనైనా నాథన్ లయన్ కి ఆడమ్ జంపా లాంటి స్పిన్నర్ ని గ్రూమ్ చేసుకున్నారు కానీ..పేస్ కి ఆప్షన్స్ పెట్టుకోలేదు. పూర్తిగా పేస్ ట్రిప్లెట్ పైనే ఆధారపడిపోయారు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కి చూస్తే స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్ ఇద్దరూ గాయాలు కారణంగా వరల్డ్ కప్ కి దూరమైపోయారు. ఫిట్నెస్ కూడా అంతంతమాత్రంగానే ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. సో బార్ట్ లెట్, నాథన్ ఎల్లిస్, స్టాయినిస్, గ్రీన్ ను నమ్ముకుని  వరల్డ్ కప్ కి వచ్చేసింది. ఫలితమే జింబాబ్వే, శ్రీలంక లాంటి టీమ్స్ పైనా ఆసీస్ కు ఘోర ఓటములు ఎదురయ్యాయి. ఐర్లాండ్, ఒమన్ లాంటి జట్లపై మాత్రమే విజయాలు సాధించి ఆసీస్..అనూహ్యంగా  లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఐసీసీ ఈవెంట్స్ అన్నా వరల్డ్ కప్ అన్నా గుర్తొచ్చే ఆసీస్ జట్టు భారత్ పై 2023 లో వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో మరో ఐసీసీ టోర్నీ గెలవకపోవటం కనీసం ఆ పోటి ఇచ్చే స్థాయి జట్టుగా కనిపించటం కనుమరుగవటం నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola