Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam

Continues below advertisement

  విజృంభిస్తాడనుకున్న మహారాజు మరోసారి డకౌట్ అయ్యాడు. ఫామ్ కోల్పోయాడు అనుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయ్యర్ తో కలిసి రెచ్చిపోయాడు. కానీ బ్యాడ్ లక్ బంతాడేసుకున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ బలం సరిపోలేదు. అసలు అతి తక్కువ స్కోరుకు అయిపోతారని ఓ టైమ్ లో అనుకున్నా..చివరకు గౌరవ ప్రదమైన స్కోరు కొట్టి టార్గెట్ ఇచ్చినా...భారత బౌలర్లు తమ బ్యాటర్ల కష్టానికి గుర్తింపు తీసుకువచ్చేలా కనిపించినా...ఏదీ సరైన సమయంలో వర్క్ అవుట్ కాకపోవటంతో భారత్ రెండో వన్డేలోనూ ఓడిపోయింది. ఫలితంగా మూడు వన్డే ల సిరీస్ 0-2 తేడాతో ఆస్ట్రేలియాకు కోల్పోయింది. యథావిధిగా టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 9వికెట్ల నష్టానికి 264పరుగులు చేసింది. కింగ్ కొహ్లీ వరుసగా రెండో వన్డేలోనూ డకౌట్ కాగా...గిల్, కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యారు. బట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 73పరుగులు, శ్రేయస్ అయ్యర్ 61పరుగులు చేసినా భారత్ అనుకున్నంత స్కోరు అయితే రాలేదు. 213పరుగులకే 6వికెట్లు కోల్పోయినా అక్షర్ పటేల్ 44 రన్స్, హర్షిత్ రానా 24 రన్స్ చేయటంతో భారత్ 265పరుగుల టార్గెట్ ను ఆసీస్ కి ఇవ్వగలిగింది. ఓ మోస్తరు టార్గెట్ కళ్ల ముందు ఉండటంతో ఆసీస్ కాస్త ఆచి తూచి ఆడింది. 54పరుగులకే ప్రమాదకర మిచ్ మార్ష్, ట్రావియెస్ హెడ్ ఔట్ అయినా ఆసీస్ కంగారు పడలేదు.  వన్ డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ 74పరుగులు, కూపర్ కనోలీ 61పరుగులు చేశారు. మిచెల్ ఓవెన్ చివర్లో మెరుపులు మెరిపించటంతో ఆసీస్ టార్గెట్ ను కంఫర్టబుల్ గా ఛేజ్ చేసింది. అర్ష్ దీప్, హర్షిత్ రానా, సుందర్ రెండేసి వికెట్లు తీసి మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినా టార్గెట్ చిన్నది కావటంతో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించటంతో పాటు వన్డే సిరీస్ నూ కైవసం చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola