Asia Cup 2025 Team India Selection | ఆసియా కప్ భారత జట్టులో ఊహించని మార్పులు.? | ABP Desam

 కోచ్ గా గంభీర్ వచ్చిన తర్వాత మన టీమిండియా సాధించిన విజయాల మాటేంటో కానీ టీమ్ సెలక్షన్ మీద మాత్రం ఎవ్వడికీ క్లారిటీ ఉండటం లేదు. ఇంకో మూడు నాలుగేళ్లు ఆడుకునే వీలుండే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లను రెడ్ బాల్ క్రికెట్ కు దూరం అయ్యేలా గంభీర్ కీలకపాత్ర పోషించాడని అందరూ అనుకుంటున్నదే. అలాంటిది ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ లోనూ విపరీతమైన మార్పులు కోరుకుంటున్నాడు గంభీర్. అదేంటంటో భారత క్రికెట్ భవిష్యత్తు మరో పదిహేనేళ్లు పాటు టీమిండియా సేవలు అందించగలిగే సత్తా ఉన్న ఇద్దరు యువ క్రికెటర్లను టీ20 టీమ్ నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని డ్రెస్సింగ్ రూం సమాచారం. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకుని తొలి సిరీస్ ఇంగ్లండ్ తో ఆడి వాళ్ల దేశంపైనే యువభారత్ సత్తా ఏంటో చూపించిన కెప్టెన్ శుభ్ మన్ గిల్, మూడు ఫార్మాట్లకు ఆడ గల ప్రతిభ ఉండి ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా క్రికెట్ అని చెప్పుకుంటున్న యశస్వి జైశ్వాల్ లలను ఆసియా కప్ టీ20 సెలక్షన్ కి పరిగణించ వద్దని గంభీర్ టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కి చెప్పినట్లు సమాచారం అందుతోంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ తయారు అవ్వాలని గంభీర్ ఆదేశించటం చూస్తుంటే వాళ్లిద్దరినీ కంప్లీట్ టెస్ట్ ప్లేయర్లుగా తయారు చేయాలని గంభీర్ భావిస్తున్నాడా అనే డౌట్స్ రాక మానటం లేదు. గంభీర్ ఛాయిస్ ప్రకారం టీ20లకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా సరిపోతారని వన్ డౌన్ లో సాయి సుదర్శన్ ను ఆడించాలని ప్లాన్ తో ఉన్నాడట. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడే యువభారత్ కి మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ను కాదని శ్రేయస్ అయ్యర్ కి ఛాన్స్ ఇద్దామని గంభీర్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే రాహుల్ ని టీ20 లకు దూరం చేసి వన్డే, టెస్టులకు పరిగణించాలని ఆలోచనా ఎవ్వరికీ ఏమీ అంతు చిక్కటం లేదు. సిరాజ్ గాయం కారణంగా, బుమ్రా పని ఒత్తిడి కారణంగా ఆసియా కప్ ఆడే అవకాశం లేకపోవటంతో ఇద్దరు బౌలర్లు ఎవరనై డైలమా కూడా ఉంది. మొత్తానికి ఈ కన్ఫ్జూన్ అంతా పోవాలంటే మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసే ఆసియా కప్ టీ20 టీమ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola