Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam

కోట్లాది మంది అభిమానులున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్స్ మారారు. సుమారు 1.78 బిలియన్ డాలర్లతో ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును సొంతం చేసుకుంది. 

28 ఏళ్ల  ఆర్యమన్ బిర్లా ఆర్‌సీబీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడైన ఆర్యమన్‌కు క్రికెట్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ కూడా. ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌పై సెంచరీ సాధించిన రికార్డు ఆయన పేరిట ఉంది. ప్రస్తుత ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి గతంలో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం విశేషం.

2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆయనను 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దాంతో 2020లో క్రికెట్ నుంచి విరామం తీసుకున్నారు. ఇప్పుడు తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూనే.. ఏకంగా ఓ ఐపీఎల్ జట్టుకే బాస్‌గా తిరిగి రావడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola