Altercation Between David Warner & Shaheen Afridi: మూడో టెస్టు 3వ రోజు ఆఖర్లో ఆసక్తికర సంఘటన

Australia, Pakistan మధ్య Lahoreలో జరుగుతున్న Third Test మూడో రోజు ఆట చివర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోజులో ఆఖరి బాల్ ను Shaheen Afridi వేయగా, దాన్ని David Warner డిఫెండ్ చేశాడు. ఆ తర్వాత వార్నర్ కు అతి దగ్గరగా వెళ్లిన షాహిన్... తేల్చుకుందాం రా అన్నట్టుగా చూశాడు. దానికి వార్నర్ కూడా అంతే దీటుగా స్పందించాడు. ఎక్కడా తగ్గలేదు. అయితే ఇదంతా సరదాగానే జరగడం విశేషం. ఆ ఇద్దరూ వెంటనే నవ్వుకోవడం కెమెరాల్లో రికార్డయింది. ఈ సరదా ఇన్సిడెంట్ ను Pakistan Cricket Board తమ Twitter Handle లో Share చేసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola