Akshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam
ఈ బక్క పలుచటి బాపు టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. టీమిండియా క్రికెట్ లో బాపు అని ముద్దుపేరుతో పిలుచుకునే అక్షర్ పటేల్ చూడటానికి సన్నగా కరెంట్ తీగలా ఉన్నా...వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాకు సాలిడ్ షాక్ ఇచ్చాడు. 34పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయిన దశలో మిడిల్ ఆర్డర్ లో ప్రమోషన్ మీద బ్యాటింగ్ కి దిగాడు అక్షర్. ఆ టైమ్ కి రోహిత్, పంత్, సూర్య లాంటి కీలక బ్యాటర్లు అవుటైపోయారు. మరో ఎండ్ లో విరాట్ కొహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు అక్షర్ పటేల్. తను వస్తానని ఊహించని సౌతాఫ్రికా బౌలర్లను ముందు ఆచి తూచి ఆడుకుని మెల్లగా జోరు పెంచాడు. 31 బాల్స్ లో 1 ఫోరు,4 భారీ సిక్సర్లతో 47పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు డికాక్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు కానీ అక్షర్ పటేల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌలింగ్ లోనూ జోరు మీదున్న ట్రిస్టన్ స్ట్రబ్ వికెట్ తీసుకోవటం ద్వారా తన ఆల్ రౌండ్ టాలెంట్ చూపించాడు అక్షర్ పటేల్. ఈ ఫైనల్లోనూ ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లోనూ జోరు చూపించాడు అక్షర్ పటేల్. ఓవర్లో వేసిన ప్రతీ ఓవర్ మొదటి బంతికి వికెట్ తీసుకుంటూ ఇంగ్లండ్ ను ఓడించి భారత్ ను ఫైనల్ చేరుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్ బౌలింగ్ లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అక్షర్..ఫైనల్లో బ్యాటింగ్ లో రాణించి టీమిండియా వరల్డ్ కప్ అందుకోవటంలో చాలా దోహదపడ్డాడు. భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు.