Afganistan vs Pakistan | పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam

ఆఫ్గానిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ పాకిస్తాన్‌ జట్టుపై పగ తీర్చుున్నాడు. పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించాడు. షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్, యూఏఈ జట్లు ట్రై సిరీస్‌ ఆడుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో యూఏఈలోనే జరగబోతున్న ఆసియా కప్‌కి ముందు వార్మప్‌గా ఈ సిరీస్‌ని సెట్ చేసుకున్నాయి ఈ మూడు దేశాలు. అయితే ఈ సిరీస్ స్టార్ట్ కావడానికి ముందే ఆప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పాకిస్తాన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో పాకిస్తాన్‌తో ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలిచి టైటిల్ కొట్టేస్తామని ఛాలెంజ్ చేశాడు. కానీ ఆగస్ట్ 29న జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతిలో 39 పరుగుల తేడాతో ఆప్గానిస్తాన్ ఓడిపోయింది. దీంతో అవమానంతో బాధపడ్డ ఆప్గాన్ టీమ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం సూపర్ విక్టరీ సాధించి పగ తీర్చుకుంది. 20 ఓవర్లలో 169 పరుగులు చేసిన ఆఫ్గానిప్తాన్.. పాకిస్తాన్‌ టీమ్‌ని తన స్పిన్ మాయతో దెబ్బకొట్టింది. పాక్ ఓపెనర్ ఓపెనర్ షయీమ్ అయూబ్‌ని తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా అవుట్ చేసి పాక్‌కి ఊహించని షాకిచ్చింది. ఇక స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ రంగంలోకి దిగడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఈ ముగ్గురు స్పిన్నర్లు కేవలం 70 పరుగులనే ఇచ్చి కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి.. చివరికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్ జట్టుపై తొలి మ్యాచ్ ఓటమికి పగ తీర్చుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola