Afg vs Ban vs Aus Semis Chances | T20 World Cup 2024 లో గ్రూప్ A సెమీస్ ఛాన్స్ వీళ్లకే | ABP Desam

Continues below advertisement

 టీ 20 వరల్డ్ కప్ సూపర్ 8 లో గ్రూప్ A నుంచి ఫస్ట్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. టీమిండియా ను ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. కానీ సెమీస్ కు అర్హత సాధించే రెండో టీమ్ ఏది అనేది ఇప్పుడు అసలు టెన్షన్. ఇప్పుడు జరుగుతున్న ఆఫ్గన్, బంగ్లా దేశ్ మ్యాచ్ రిజల్ట్ దీనిని డిసైడ్ చేయనుండగా ఇప్పటికీ మూడు టీమ్స్ కి సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అదెలానో చూద్దాం.


1. ఆఫ్గనిస్థాన్
 ఆఫ్గనిస్థాన్ సెమీస్ కి చేరాలంటే ఒక్కటే దారి. బంగ్లా దేశ్ ను తమ ఆఖరి మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓడించి తీరాల్సిందే. అప్పుడు ఆస్ట్రేలియా, బంగ్లా దేశ్ లు సూపర్ 8 దశ నుంచి నిష్క్రమిస్తాయి. ఆఫ్గనిస్థాన్ సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడుకుంటుంది.

2. ఆస్ట్రేలియా
 ఆస్ట్రేలియాకు భారత్ మీద ఓడినా సెమీస్ ఛాన్స్ ఉంది. బంగ్లా దేశ్ మీద గెలవటం వల్ల ఆస్ట్రేలియాకు రెండు పాయింట్లు ఉన్నాయి కానీ టీమిండియా మీద ఓటమి వల్ల భారీగా నెట్ రన్ రేట్ ను కోల్పోయింది ఆస్ట్రేలియా. సో ఆఫ్గాన్, బంగ్లా మ్యాచ్ ఆస్ట్రేలియా ఫేట్ ను డిసైడ్ చేస్తుంది. ఆఫ్గాన్, బంగ్లా మ్యాచ్ లో  ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేసింది. 115పరుగులు కొట్టింది. సో బంగ్లా టార్గెట్ 116పరుగులు. ఈ టార్గెట్ ను బంగ్లా చేరుకోవాలి. కానీ అందుకు బంగ్లా బ్యాటర్లు 13ఓవర్లు పైన ఆడి గెలవాలి. అలా చేస్తే మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా రన్ రేట్ ను బంగ్లా దేశ్ మ్యాచ్ చేయలేదు కాబట్టి ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ అడ్వాంటేజ్ తో సెమీస్ కు వెళ్తుంది.


3. బంగ్లా దేశ్
 ఈ గొడవలో బంగ్లా దేశ్ కి కూడా ఛాన్స్ ఉంది. అదేటంంటే ఇప్పుడు ఆఫ్గాన్ విసిరిన 116పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ 13ఓవర్లలో పు ఛేజ్ చేసేయాలి. అలా చేస్తే నెట్ రన్ రేట్ భారీగా పెరిగి మ్యాచ్ గెలిచినందుకు వచ్చే టూ పాయింట్స్ తో పాటు ఆస్ట్రేలియాను మించిన రన్ రేట్ తో  భారత్ తో పాటు బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది.

ప్రస్తుతానికి అయితే వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ఆగింది. ఇదిలానే కొనసాగినా..లేదా వర్షం పడినా ఆఫ్గాన్, బంగ్లా కు చెరో పాయింట్ వస్తాయి కాబట్టి ఏ గోలా లేకుండా మూడు పాయింట్లతో ఆఫ్గనిస్థాన్ సెమీస్ కు వెళ్లిపోతుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లు ఇంటి దారి పడతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram