Afg vs Ban Super8 match Highlights | అత్యద్భుత విజయంతో T20 World Cup 2024 సెమీస్ కు ఆఫ్గాన్ | ABP
వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్. అనుకున్నదంతా అయ్యింది. ఆఫ్గానిస్థాన్ తన ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పెను సంచలనానికి సమానమైన విజయం సాధించింది. బంగ్లా, ఆఫ్గాన్, ఆస్ట్రేలియా మూడు టీమ్స్ కి సెమీస్ ఛాన్సెస్ ఉంటాయనే అంచనాలతో మొదలైన ఆఫ్గాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అనేక ట్విస్టులు, టర్నులు, ఆస్కార్ ఫర్ ఫార్మెన్స్ లు, వర్షం ఆటంకాలను దాటుకుని విజయం ఆఫ్గాన్ ను ముద్దాడింది. దే డిసర్వ్ ఇట్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్గాన్ కు ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీం జాద్రాన్ మరోసారి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 59 పరుగులకు జాద్రాన్ అవుట్ అవటంతో మొదటి వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్ రిషాద్ హొస్సేన్ మూడు వికెట్లు తీసుకున్నాడు గుర్భాజ్ 43పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సులు కొట్టడంతో ఆఫ్గాన్ 115పరుగులన్నా చేయగలిగింది. 116పరుగుల టార్గెట్ తో దిగిన బంగ్లా 12.1 ఓవర్ లో ఆ టార్గెట్ ఛేజ్ చేస్తే సెమీస్ కు వెళ్లొచ్చు. అందుకే ముందు నుంచి దూకుడుగా ఆడింది. కనీసం ఆఫ్గాన్ బౌలర్లు అంత తేలిగ్గా పరుగులు రానివ్వలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్ కి దిగాక మ్యాచ్ స్వరూపం మార్చేశాడు. నాలుగు ఓవర్లలో 23పరుగులే ఇచ్చి 4వికెట్లు తీసిన రషీద్ బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నవీన్ ఉల్ హక్ కూడా 4వికెట్లు తీయటంతో బంగ్లా 105పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మధ్యలో అనేక సార్లు వర్షం పడటం...డక్ వర్త్ లూయిస్ స్కోర్లు మారటం...మధ్యలో మ్యాచ్ ను స్లో డౌన్ చేసేందుకు ఆఫ్గాన్ ఆటగాళ్లు ఆస్కార్ ఫర్ ఫార్మెన్స్ చేయటం కూడా జరిగాయి. ఏదైతేనేం ఈ ఘన విజయంతో ఆఫ్గాన్ సగర్వంగా వరల్డ్ కప్ లో సెమీస్ లో అడుగుపెట్టింది. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. సెమీస్ 1లో సౌతాఫ్రికాతో ఆఫ్గాన్ తలపడనుంది.