Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP Desam

Continues below advertisement

Abhishek Sharma's Maiden T20I Century |

కల్కీలో ఓ డైలాగ్ ఉంటుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి మారడు..మారలేడు. అభిషేక్ శర్మ ఆడేది ఐపీఎల్ ఐనా, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఐనా వాడు కొట్టుడు ఆపడు..ఆపలేడు..! జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ లో ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఐతేనేం..రెండో మ్యాచులో ఏ మాత్రం బెదరకుండా సెంచరీ కొట్టాడు. అది కూడా 47 బాల్స్ లోనే. ఇందులో 8 సి క్సులు, 7 ఫోర్లు ఉన్నాయి.33 బంతుల్లో మొదటి 50 పరుగులు పూర్తి చేసిన అభిషేక్, తర్వాతి 50 పరుగులను కేవలం 13 బంతుల్లోనే చేరుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లతో అభిషేక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ శిష్యుడు అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ..! ఐపీఎల్ లోనూ అంతే. 200 ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడుతూ..టీ20ల్లో సరికొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే ఫాం కనుక కొనసాగిస్తే... రోహిత్ శర్మ వారసుడు వచ్చాడు అనుకోవచ్చు. అభిషేక్ శర్మ లెఫ్ట్ హార్మ్ బౌలిక్ కూడా వేస్తాడు కాబట్టి.. త్వరలోనే మెయిన్ టీంలో శర్మ విధ్వంసాన్ని చూడొచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram