Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సినిమాలు అంటే ఎంతో ఇష్టమో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తెలుగు ప్లేయర్స్ ను అడిగి తెలుసుకుంటుంటానని వెల్లడించాడు.

కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా తనకు పిచ్చెక్కించిందని అభిషేక్ అన్నాడు. ఆ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యానని, గతంలో మైదానంలో కూడా 'తగ్గేదే లే' అంటూ చేసి చూపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాగే 'RRR' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్‌ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతమని అన్నాడు. 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పటి నుంచే అభిషేక్ తెలుగు అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. సంజు శాంసన్ కూడా ఫేవరేట్ హీరో గురించి చెప్పాడు. రజనీకాంత్ సర్ ఏ మూవీ అయినా నాకు ఇష్టమే అని అన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola