Abdul Razzaq On Aishwarya Rai: నోరు పారేసుకుని ఐశ్వర్యపై అబ్దుల్ అసభ్య కామెంట్స్
Abdul Razzaq: పాకిస్తాన్ క్రికెటర్లు తరచుగా భారత్ పైనా, భారత క్రికెట్ జట్టుపైనా తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. సందర్భం ఏదైనా ఇండియాను ఎలా బ్లేమ్ చేయాలా? అని చూస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అసందర్భంగా ఆమెపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం పట్ల భారతీయుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.