AB de Villiers Two Dreams Come True | అటు ఆర్సీబీ గెలుపు చూశాడు..ఇటు సౌతాఫ్రికా సంబరాన్ని ఆస్వాదించాడు | ABP Desam

Continues below advertisement

 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏలియన్ అని పిలుచుకునే ఏబీ డివిలియర్స్ కి రెండు కలలు ఒకే నెలలో తీరాయి. సౌతాఫ్రికాకు ఓ ఐసీసీ ట్రోఫీ కోసం తను ఆడిన 14ఏళ్లు విపరీతంగా కష్టపడిన ఏబీడీ..తన కలను మాత్రం తీర్చుకోలేకపోయాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాలని పదేళ్ల పాటు కష్టపడిన మిస్టర్ 360 ఆ కలను నెలవేర్చుకోలేకపోయాడు. కానీ అదృష్టవశాత్తూ ఒకే నెలలో యాద్ధృచ్ఛికంగా ఆ రెండు కలలను ఏబీ నెరవేర్చుకున్నాడు. పైగా ఆ రెండు సంబరాల్లోనూ ప్రత్యక్షంగా ఏబీ డివిలయర్స్  పాల్గొన్నాడంటే నే అర్థం చేసుకోవచ్చు తనకు క్రికెట్ అంటే ఎంతటి మమకారమో. జూన్ 3న పంజాబ్ కింగ్స్ తో ఫైనల్ కోసం ఆర్సీబీ విజయాన్ని దగ్గరుండి చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి హాజరైన ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ కప్ కొట్టగానే ఎమోషనల్ అయ్యాడు. కింగ్ విరాట్ కొహ్లీని చిన్న పిల్లాడిలా హగ్ చేసుకుని తన ఆనందాన్ని తెలిపాడు. కొహ్లీ కూడా అంతే గౌరవం ఇచ్చి ఐపీఎల్ ట్రోఫీని ఏబీడీ చేతుల్లో పెట్టి రెస్పెక్ట్ చూపించాడు. సేమ్ ఇవాళ సౌతాఫ్రికా 27ఏళ్ల తర్వాత ఐసీసీ మేజర్ ట్రోఫీని అందుకునే టైమ్ లోనూ ఏబీ డివిలియర్స్ ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో ఉన్నాడు. తన పిల్లలతో కలిసి వచ్చి టెస్ట్ క్రికెట్ మజాను ఎంజాయ్ చేశాడు. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చూసి సౌతాఫ్రికా గదను అందుకునేటప్పుడు దగ్గరుండి చూసి తన రెండో కలను కూడా తీర్చుకున్నాడు ఏబీ డివిలియర్స్. తన కెరీర్ లో సాధించలేకపోయిన విజయాలను తన ఆడిన జట్లు సాధిస్తుంటే చిన్న పిల్లాడిలా మురిసిపోతూ తన క్రికెట్ ప్రేమను చాటుకున్నాడు ఏబీడీ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola