AB de Villiers on Dewald Brevis CSK Auction | ఐపీఎల్లో బ్రేవిస్ ను వద్దనుకున్న జట్లు బాధపడతాయి | ABP Desam
నిన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికన్ యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ ను ప్రశంసలతో ముంచెత్తాడు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికన్ యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ 56 బంతుల్లో 12 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియా ఓటమిని ఒంటి చేత్తో శాసించాడు. ఈ ఇన్నింగ్స్ పైనే డివిలియర్స్ ట్వీట్ చేశాడు. ప్రధానంగా డెవాల్డ్ బ్రేవిస్ ను వద్దనుకున్న ఐపీఎల్ జట్ల గురించి మాట్లాడాడు ఏబీడీ.
22 ఏళ్లకే టీ20 సెంచరీ ఆ ఘనత సాధించిన యువ సౌతాఫ్రికన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించిన డెవాల్డ్ బ్రేవిస్ ను వద్దనుకున్న ఐపీఎల్ జట్లు చాలా నష్టపోయయన్నాడు. ఎందుకంటే మొన్నటి మెగా ఆక్షన్ లో అప్పటికి 21ఏళ్ల డెవాల్డ్ బ్రేవిస్ ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. కొనేందుకు ఆర్సీబీ, తమ పాత ప్లేయర్ ను అట్టిపెట్టుకునేందుకు RTM లాంటి ఆప్షన్లు ఉన్నా ముంబై ఇండియన్స్ వాడుకోలేదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడే తెలివిగా వ్యవహరించింది. ఆక్షన్ తర్వాత గుర్జప్నీత్ సింగ్ అనే అన్ క్యాప్డ్ ప్లేయర్ గాయపడితే అతని స్థానంలో ఏకంగా డెవాల్డ్ బ్రేవిస్ ను సైలెంట్ గా తీసుకుంది CSK. రెండుకోట్ల 20 లక్షల రూపాయల ధరకు బ్రేవిస్ ను కొనుగోలు చేసింది. తనను ఎవ్వరూ కొననప్పుడు అవకాశం ఇచ్చిన సీఎస్కే కోసం ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా పోరాడాడు బ్రేవిస్. సీఎస్కే విజయాలు సాధించకపోయినా సరే తన వంతుగా తన అద్భుతమైన ఆటను డిస్ ప్లే చేశాడు బేబీ ఏబీడీ. ఆరు మ్యాచులు మాత్రమే ఆడినా 180 స్ట్రైక్ రేట్ తో రెండు హాఫ్ సెంచరీలతో 225పరుగులు చేశాడు. ఇది తనకు కెరీర్ ఐపీఎల్ బెస్ట్ రన్స్. సీఎస్కే ప్రణాళికల ప్రకారం కనీసం పదేళ్ల పాటు బ్రేవిస్ ను సీఎస్కే ఆడించేలా చేయాలనేది స్ట్రాటజీ. దీని గురించే మాట్లాడాడు బేబీ ABD. ఎవ్వరూ కొననప్పుడు బ్రేవిస్ ను కొనుక్కున్న సీఎస్కే చాలా లక్కీ అయినా అయ్యిండాలి లేదంటే ఇది ధోని కనుసన్నల్లో నడిచే సీఎస్కే కొట్టిన మాస్టర్ స్ట్రోక్ అయినా అయ్యిండాలి. కానీ మిగిలిన టీమ్స్ మాత్రం తాము ఏం కోల్పోయామో కచ్చితంగా తెలుసుకుంటాయ్ అన్నాడు డివిలియర్స్.