అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు

యాషెస్ సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్ కు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం జూలై 31న టీమిండియాతో జరిగిన ఓవల్ టెస్టు లో బౌలింగ్ చేస్తూ క్రిస్ వోక్స్ గాయపడ్డాడు. అతని చేతి ఎముక పక్కకు జరగడంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో చేతికి కట్టు కట్టుకొని మరి బ్యాటింగ్‌కి వచ్చాడు. నొప్పిని అలానే తట్టుకుంటూ బ్యాటింగ్ చేశాడు. నవంబరులో జరిగే యాషెస్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన ఇంగ్లండ్‌ టీమ్ లో తన పేరు లేకపోవడం కూడా ఇలా సడన్ రిటైర్మెంట్ కు కారణమని అంటున్నారు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి వాళ్ళు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్‌ బలహీనమైంది. ఇప్పుడు క్రిస్ వోక్స్ కూడా తప్పుకోవడంతో టెస్టుల్లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ వీక్‌గా మారనుంది అనే చెప్పాలి. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్‌కి ఆడాడు క్రిస్ వక్స్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola