Chennai Super Kings in WPL | WPLలో సీఎస్కే ఎంట్రీ

Continues below advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women Premier League ) ప్రతి సంవత్సరం పాప్యులర్ అవుతూనే ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి దిగ్గజ టీమ్స్ ఈ లీగ్ లో  పాల్గొంటున్నాయి. అయితే ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్త టీమ్ వచ్చి చేరనుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ). ఐపీఎల్ లో తిరుగులేని టీమ్ గా పేరు తెచ్చుకున్న CSK ఇప్పుడు WPL లో కూడా విశ్వరూపం చూపించడానికి సన్నాహాలు మొదలు పెట్టిందట. 

ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ( CEO Kashi Viswanathan ) క్లారిటీ ఇచ్చారు. మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, WPL లో భాగస్వామ్యం కావడం తమ నెక్స్ట్ మెయిన్ గోల్ అని ఆయన వెల్లడించారు.

రీసెంట్ గా కాశీ విశ్వనాథన్, సీఎస్కే భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో బలమైన బ్రాండ్‌గా ఎదిగిన సీఎస్కే, ఇకపై మహిళల క్రికెట్‌లో కూడా అదే ముద్ర వేయాలని భావిస్తోందని తెలిపారు. గ్రాస్‌రూట్ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కాశీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఇక 2008 నుంచి సీఎస్కేకు ధోనీ ( MS Dhoni) బలంగా మారాడని, తన నాయకత్వం వల్లే టీమ్ ఎన్నో విజయాలను అందుకుంది అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola