Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

వరుస విజయాలతో ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్, పడుతూ లేస్తూ ముందుకెళ్తున్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్ కాబోతున్న విషయం ఒకటే బుమ్రా vs వైభవ్. 

తన యార్కర్లతో ఎంతోమంది సూపర్ ప్లేయర్స్ ను కూడా కట్టడి చేసాడు బుమ్రా. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కి బుమ్రా బ్యాక్ బోన్ అనే చెప్పాలి. ఇక మరోవైపు అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి తన దూకుడుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. వైభవ్ రాజస్థాన్ ఇన్నింగ్స్‌కు కీలకంగా మారాడు. అనుభవం నిండిన బుమ్రా బౌలింగ్‌ను, ఈ యంగ్ క్రికెటర్ ఏ విధంగా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. 

రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి హిట్టర్లు ఉన్నా, వైభవ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇచ్చే రన్స్ టీమ్ కు చాలా ముఖ్యం. అటు ముంబై జట్టులో రోహిత్, సూర్యకుమార్ వంటి స్టార్స్ ఉన్నా, బుమ్రా వేసే ఆ నాలుగు ఓవర్లే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ యంగ్ సెన్సేషన్ వైభవ్ .. అనుభవం ఉన్న బుమ్రా ను ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola