Bumrah in 5th Test Match | 5వ టెస్ట్ నుంచి బుమ్రా అవుట్ ?

ఇంగ్లాండ్ తో జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో .... భార‌త బౌలింగ్ లైన‌ప్ పై మెల్ల మెల్లగా ఒక క్లారిటీ వస్తుంది. తాజాగా జ‌రిగిన నెట్ సెష‌న్ లో పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ద ఓవ‌ల్ టెస్టులో అర్ష‌దీప్ ఆడ‌టం దాదాపుగా ఖాయం అయిందని తెలుస్తోంది. నిజానికి మాంచెస్ట‌ర్ టెస్ట్ లోనే అర్ష‌దీప్ ను ఆడించాలని అనుకున్నారు. కానీ ట్రైనింగ్ సెష‌న్ లో గాయపడ్డడం వల్ల ఆడలేకపొయ్యాడు. అందుకే అన్షుల్ కాంబోజ్ టీంలోకి వచ్చాడు. 

స్టార్ పేస‌ర్ బుమ్రా ఆడాల్సిన మూడు మ్యాచులు అయిపోయాయి. దాంతో సిరాజ్, అర్ష‌దీప్, ఆకాశ్ దీప్ ల‌తో టీం ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. ఇక స్పిన్ ఆల్ రౌండ‌ర్లుగా ర‌వీంద్ జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఆడ‌టం కూడా ఆల్మోస్ట్ ఒకే అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మ‌రోవైపు పిచ్ ప‌రిస్థితిని బ‌ట్టి శార్దూల్ ఠాకూర్.. కుల్దీప్ యాదవ్ ల‌లో ఒక‌రిని ఆడించే అవ‌కాశ‌ముంది. చూడాలి మరి బౌలింగ్ పరంగా టీం ఇండియా ఎలాంటి మార్పులు చేస్తుందో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola