Bumrah Fighter Jet Celebrations Asia Cup Final | హారిస్ రౌఫ్‌కు బుమ్రా కౌంటర్
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో బుమ్రా చేసిన సెలెబ్రేషన్స్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. రెండు టీమ్స్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ కు కౌంటర్ ఇచ్చాడు బుమ్రా.
సూపర్ 4 లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హారిస్ రౌఫ్... బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ జెట్ కూలిపోతున్నట్టు చేసి ఫ్యాన్స్ కు చూపించాడు. రౌఫ్ చేసిన ఈ పని భారత సైనికులను, ఆపరేషన్ సింధూర్ ను ఊదేశించే చేసినదేనని అందరు మండిపడ్డారు.
అయితే ఆసియా కప్ ఫైనల్ లో యార్కర్‌తో హారిస్ రౌఫ్ వికెట్ పడగొట్టాడు బుమ్రా. విమానం కిందపడుతున్నట్టుగా ... గతంలో రౌఫ్ చేసిన విధంగా చేసి చూపించాడు. బుమ్రా చేసిన సెలబ్రేషన్ తో స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ఉర్రూతలూగించారు. ఒక సారిగా ఫైటర్ జెట్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే పర్ఫెక్ట్ రివెంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.