Broadcaster shows 5 photos of Hardik Pandya | WI vsPNG Highlights | టీ20 ప్రపంచక్ కప్ లో తప్పిదం
యస్...! మీరు థంబ్ లో చూసింది నిజమే. వెస్టిండీస్ జట్టులో హర్దిక్ పాండ్య కనిపించాడు. అదేలా అంటే..
యస్...! మీరు థంబ్ లో చూసింది నిజమే. వెస్టిండీస్ జట్టులో హర్దిక్ పాండ్య కనిపించాడు. అదేలా అంటే...నిన్న వెస్టిండీస్ వెర్సస్ న్యూగినీ మ్యాచులో ..వెస్టిండీస్ జట్టు గెలిచింది. అనంతరం.. టీమ్ లో ఎవరు బాగా రాణించారు అని టీవీలో గ్రాఫిక్స్ వేస్తారు కదా..! ఆ సమయంలో వెస్టిండీస్ ప్లేయర్స్ కాకుండా హర్దిక్ పాండ్య కనిపించాడు. ఇక్కడ చూడండి..! రోస్టన్ ఛేజ్, బ్రాండన్ కింగ్, సెసా బవూ, ఆండ్రూ రసూల్, వలా... ఇలా 5 మంది ప్లేస్ లోనూ హార్దిక్ పాండ్య ఫొటో కనిపించింది. దీంతో... అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
వెస్టిండీస్ జట్టులో ఒకరికి బదులుగా.. ఇంకోకరి ఫోటో వెస్తే అర్థం చేసుకోవచ్చు తొందరలో పొరపాటుగా వేశాడని. అలా కాకుండా.. ఆడుతున్న జట్లతో సంబంధం లేని ఇండియా జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫోటో వేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఏమి హాట్ స్టార్ వాడు..తాగి గ్రాఫిక్స్ కంట్రోల్ చేస్తున్నారా..? అని ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. తప్పులు సహజం కానీ, మరి ఇంత బ్లండర్ వేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ ఘోరంగా విఫలమైన హర్దిక్ పాండ్య... బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచులో టచ్ లోకి వచ్చినట్లు కనిపించింది. కేవలం 23 బాల్స్ లోనే 40 పరుగులతో రాణించాడు. ఇక.. ఈ టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా జూన్ 5న ఐర్లాండ్ తో జరిగే తొలిపోరుకు సన్నద్ధమవుతోంది.