పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

Continues below advertisement

టాప్ క్లాస్. గ్రేట్ ఇన్నింగ్స్. వాట్ ఓ షో డౌన్. పెర్త్ టెస్ట్‌లో సెకండ్‌ డే ఇండియా ఆట తీరుపై వస్తున్న కామెంట్స్ ఇవి. ఓపెనర్స్‌గా దిగిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్...ఎక్కడా తడబడకుండా చాలా కూల్‌గా ఆడారు. జైస్వాల్ 90 రన్స్ చేసి సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు. ఇదే జరిగితే ఆస్ట్రేలియన్‌ పిచ్‌పై జైస్వాల్‌కి ఫస్ట్ సెంచరీ ఇదే అవుతుంది. అటు కేఎల్ రాహుల్ కూడా జైస్వాల్‌కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరూ కలిసి 152 రన్స్ పార్ట్‌నర్‌షిప్ అందించారు. 20 ఏళ్ల తరవాత ఆస్ట్రేలియన్ పిచ్‌పై ఓపెనర్స్ వంద పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ని సాధించారు. 2004లో వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా ఓపెనర్స్‌గా దిగి ఈ ఫీట్‌ని సాధించగా..ఇప్పుడు జైస్వాల్, కేఎల్ రాహుల్‌ మరోసారి ఈ రికార్డ్ సాధించారు. వీళ్లిద్దరూ ఆట ముగించి పెవీలియన్‌ వైపు వస్తుండగా విరాట్ కోహ్లీ స్టేడియంలోకి వచ్చి క్లాప్స్ కొడుతూ వాళ్లిద్దరినీ అప్రిషియేట్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 పరుగులు చేసింది. ఈ రన్స్‌తో ఇండియా 218 రన్స్‌ లీడ్‌లోకి వచ్చింది. అంతకు ముందు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయింది. జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్‌లు, హర్షిత్ రాణా మూడు వికెట్‌లు తీసి కంగారూలను కంగారు పెట్టించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram