Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు

Continues below advertisement

స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల కీలక టీ20 సిరీస్‌కు భువీని భారత జట్టులోకి ఎంపిక చేశారు. తన స్వింగ్, ఎక్స్పీరియన్స్ తో కివీస్ బ్యాటర్లను భయపెడతాడని క్రికెట్ అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, ఈ రీ-ఎంట్రీ భువనేశ్వర్ కుమార్ కెరీర్‌లోనే వరస్ట్ స్టేజ్ లా మిగిలిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు.

ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భువీ మొత్తం 4 మ్యాచ్‌లలో ఫైనల్ టీమ్ లో ఉన్నాడు. అయితే తొలి మూడు మ్యాచ్‌లలోనూ పూర్తిగా విఫలమవడంతో, ఫామ్ లేమి కారణంగా నాలుగో టీ20 నుంచి పక్కన పెట్టారు. కానీ మేనేజ్‌మెంట్ మళ్లీ నమ్మకం ఉంచి హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌కు తిరిగి తుది జట్టులోకి తీసుకుంది. కానీ భువీ అదృష్టం మాత్రం మారలేదు. సిరీస్ పొడవునా కివీస్ పిచ్‌లపై వికెట్లు తీయడానికి ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

ఈ నాలుగు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కివీస్ బ్యాటర్లు భువీ బౌలింగ్‌ లో భారీగా పరుగులు రాబట్టారు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్ కుమార్ ఒక బిలాట్రల్ టీ20 సిరీస్‌లోవరస్ట్ బౌలింగ్ అవరేజ్ కలిగిన రికార్డును తన పేరున రాసుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola