BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!

Continues below advertisement

ఇండియన్ క్రికెట్ టీమ్ లో టీమ్ సెలక్షన్, సీనియర్స్ తో కమ్యూనికేషన్ గ్యాప్, ఫ్యూచర్ కు సంబంధించి ఎదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ఈ విషయాలపై ఫోకస్ పెట్టిందట బీసీసీఐ. ఎలాగైనా ప్లేయర్స్, సెలక్షన్ కమిటీ, స్టాఫ్ మధ్య ఉన్న ఈ గ్యాప్స్ ను తొలగించాలని నిర్ణయించుకుందట. అందు కోసమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌కు బీసీసీఐ సమన్లు పంపినట్టు తెలుస్తుంది. 

అయితే ఈ మీటింగ్ అతి త్వరలోనే జరగనుందట. సెలెక్షన్‌లో చోటుచేసుకుంటున్న వివాదాలు, మేనేజ్‌మెంట్ – సీనియర్ ప్లేయర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పై చర్చించేందుకు ఈ సమావేశం ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఈ మీటింగ్‌లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ మీటింగ్ కు సీనియర్ ప్లేయర్స్ వస్తారా లేదా అన్నది డౌట్. 

ఈ మీటింగ్ లో కేవలం టెస్ట్ మ్యాచ్ గురించే కాదని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యూచర్ గురించి కూడా.టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ కూడా ఉండటంతో ఈ సమస్యలు వెంటనే పరిష్కారం కావాలనే ఆలోచనలో ఉంది బీసీసీఐ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola