BCCI on Virat Kohli and Rohit ODI Retirement | విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై BCCI కీలక వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిటైర్ అవుతున్నారా ? ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఇది. అక్టోబర్ లో అస్ట్రేలియాతో జరిగే ODI సిరీస్‌ తరువాత కోహ్లీ, రోహిత్ రిటైర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్లు వన్డే వరల్డ్ కప్ కూడా ఆడరు. ఈ వ్యవహారంపై BCCI స్పందించింది. 

ప్రస్తుతం బీసీసీఐ ఆసియా కప్ 2025, వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్‌ పై ఫోకస్ పెట్టింది. BCCI తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. ముఖ్యంగా క్రికెట్ తో దేశానికి ఎంతో సేవ చేసిన ప్లేయర్స్ రిటైర్మెంట్ అంటే బీసీసీఐ మరింత జాగ్రత్తగా ఉంటుంది. అక్టోబర్ లో రోహిత్, విరాట్ కోహ్లీ ల రిటైర్మెంట్ ఆఫర్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అంటున్నాయట బీసీసీఐ వర్గాలు. అలాగే బీసీసీఐ ఏ ఆటగాడిని రిటైర్ అవాలని సూచించదు. అది ప్లేయర్స్ వ్యక్తిగత నిర్ణయమే. ప్లేయర్ల ప్రదర్శణ ఆధారంగా టీంలో స్థానం దక్కించుకుంటారు అని బీసీసీఐ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola