BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?

Continues below advertisement

భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో మాజీ ప్లేయర్స్ కు బిసిసిఐ అందిస్తున్న పెన్షన్ స్కీమ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టి20లు ఆడిన రహానే, బోర్డు ఇచ్చే హయ్యెస్ట్ పెన్షన్ బ్రాకెట్‌కు అర్హత సాధించాడు. ప్రపంచంలో ఏ ఇతర క్రికెట్ బోర్డు ఇవ్వని విధంగా బిసిసిఐ ప్రతి నెల భారీ మొత్తంలో ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

ఈ పెన్షన్ స్కీమ్‌ను బిసిసిఐ ఏప్రిల్ 2004లో ప్రారంభించింది. అప్పుడు కేవలం 174 మందికి నెలకు 5,000 చొప్పున మాత్రమే ఇచ్చేవారు. అయితే, జూన్ 2022లో ఈ అమౌంట్‌ను భారీగా సవరించారు. 
25 అంతకంటే ఎక్కువ టెస్టులాడిన క్రికెటర్లకు నెలకు 70,000, మిగిలిన సీనియర్ టెస్ట్ ప్లేయర్లకు 60,000, అంతర్జాతీయ మహిళా క్రికెటర్లకు 52,500, 2003కి ముందు రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు నెలకు 45,000, ఇతర ఫస్ట్ క్లాస్ ప్లేయర్లకు 30,000 అందిస్తున్నారు. 

అయితే, రిటైర్ అయిన ప్లేయర్ బిసిసిఐ లేదా స్టేట్ అసోసియేషన్‌లో నేషనల్ కోచ్‌గా, సెలెక్టర్‌గా లేదా జీతం తీసుకునే అఫీషియల్ రోల్‌లోకి వస్తే మాత్రం ఆ కాలానికి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. రహానే కెరీర్ స్టాట్స్ ప్రకారం తనకు ప్రతి నెలా అత్యధికంగా 70,000 పెన్షన్ లభించనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola