BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు

Continues below advertisement

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్స్ కు ఇచ్చే 'నమన్ అవార్డ్స్ 2026' విజేతల జాబితాను విడుదల చేసింది. ఈసారి మెన్స్ కేటగిరీలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ), ఉమెన్స్ కేటగిరీలో స్మృతి మంధాన ( Smriti Mandhana ) అగ్రస్థానంలో నిలిచారు. 

టీమిండియా టెస్ట్ మరియు వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ప్రతిష్టాత్మక 'పాలీ ఉమ్రిగర్' అవార్డు దక్కింది. గిల్ ఈ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. 2025లో 9 టెస్టుల్లో 983 పరుగులు చేసి, ఆ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులతో వీరవిహారం చేశాడు. మరోవైపు, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐదోసారి 'బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్' అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది.

అయితే, ఒకవైపు అవార్డులు వరిస్తున్నా.. టీ20 ఫార్మాట్‌లో గిల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరుసగా విఫలమవ్వడంతో టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో అతనికి చోటు దక్కలేదు. అయినప్పటికీ, టీమిండియా సమిష్టిగా రాణించి న్యూజిలాండ్‌ను ఫైనల్లో చిత్తు చేసి, వరుసగా రెండోసారి.. మొత్తం మీద మూడోసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola