Azmatullah Omarzai Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
ఆసియా కప్ 2025 టోర్నీని అప్ఘనిస్తాన్ ఘనంగా ప్రారంభించింది. హాంగ్ కాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ తో చెలరేగారు. ఓపెనర్ గా వచ్చిన సెదిఖుల్లా అటల్ 73 పరుగులు చేసి అప్ఘనిస్తాన్ టీమ్ కు భారీ స్కోర్ ను అందించారు.
అయితే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్యాట్ తో మాత్రమే కాదు బాల్ తో కూడా హాంగ్ కాంగ్ బ్యాట్స్మన్ కు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లో 53 పరుగులు చేసిన అజ్మతుల్లా... ఐదు భారీ సిక్సులను బాదాడు. సరైన టైం లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ టీమ్ కు మంచి స్కోర్ ను అందించారు. అలాగే తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మన్ ను బాగానే ఇబ్బంది పెట్టాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అజ్మతుల్లా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసాడు. ఐపీఎల్ లో మంచి ఫార్మ్ కనబర్చిన అజ్మతుల్లా ఆసియా కప్ లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.
188 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ మొదలు పెట్టిన హాంగ్ కాంగ్... వెంటనే చేతులెత్తేసింది. ఒకరిద్దరు తప్పా ... మిగితా బ్యాట్స్మన్ అంతా సింగల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు.