Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 18 ఏళ్ల ఆయుష్ మాత్రే విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ విమర్శల పాలైంది. మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, చెన్నై మేనేజ్మెంట్ అతడిని రిటైర్డ్ అవుట్ చేయాలని నిర్ణయించింది. మాత్రే అద్భుతమైన ఆటతొ అర్ధ శతకం చేసినప్పటికీ, అతడిని రిటైర్డ్ అవుట్ చేయాలనే ఫ్రాంచైజీ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఒక ఆటగాడు పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు అతడిని రిటైర్డ్ ఔట్ చేస్తారు. కానీ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. అయితే రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు చివరి 3-4 బంతుల్లో మాత్రే సింగిల్స్ మాత్రమే తీశాడు. క్రీజులో సెట్ అయిన ఆయుష్ మాత్రే చివరి 2 ఓవర్లలో గేర్ మార్చి వేగంగా ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ, 18వ ఓవర్లోనే వికెట్ పడకుండానే అతడు పెవిలియన్ బాట పట్టాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా రిటైర్డ్ అవుట్ చేయాలనే CSK నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందుకే అభిమానులు సైతం సీఎస్కే నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. మాత్రే స్థానంలో సంజూ శాంసన్‌ను రిటైర్డ్ అవుట్ చేయడం సరైన నిర్ణయం అని మరి కొందరు అంటున్నారు. ఎందుకంటే శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడి అలసిపోయినట్లు కనిపించాడు. కానీ సెంచరీకి దగ్గరగా ఉండటమే శాంసన్‌ను అవుట్ చేయకపోవడానికి కారణమై ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola