Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20

Continues below advertisement

ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్ లో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. దాంతో ఎలాగైనా టీ20 సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 29న ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరుగుతుంది. 

ఈ టీ20 మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీం ఇండియా బరిలోకి దిగుతుంది. సూర్య కెప్టెన్సీలో ఆసియా కప్‌ గెలుచుకుంది టీమ్ ఇండియా. గత 5 సంవత్సరాలలో ఆస్ట్రేలియా భారత్ మధ్య 10 టీ20 జరిగాయి. ఇందులో భారత 8 మ్యాచ్‌లలో గెలిచింది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లలో గెలిచింది. 

అయితే మొదటి టీ20 మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో వర్షం పడే అవకాశం ఉంది. కాన్‌బెర్రా పిచ్‌ లో 150-160 పరుగుల స్కోరు మంచిదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కొత్త బాల్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. మరి ఈ మ్యాచ్ లో మన ఇండియా ప్లేయర్స్ ఎలా పెర్ఫర్మ్ చేస్తారో చూడాలి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola