Asia Cup 2025 | Mohsin Naqvi | మొండిపట్టు వదలని మోహ్సిన్ నఖ్వీ

Continues below advertisement

ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనల గురించి మనకు తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన టీమ్ ఇండియా ట్రోఫీని పీసీబీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తోసుకోవడానికి నిరాకరించింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లి.. దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీసులో తాళం వేసి మరి దాచుంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. 

అంతే కాకుండా ఆసియా కప్ ట్రోఫీని తన అనుమతి లేకుండా అక్కడి నుంచి తీయకూడదని చేపినట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత ప్లేయర్స్.. పాక్ ప్లేయర్స్ తో షేక్ హ్యాండ్ కి కూడా నిరాకరించడం వల్లే నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ట్రోఫీని తానే ఇండియా టీమ్ కు లేదా బీసీసీఐకి అప్పగిస్తానని, మరెవ్వరికీ ఇవ్వనని ఆయన అంటున్నారట. 

నఖ్వీ నిర్ణయాలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై బీసీసీఐ గట్టిగ వాదించనుంది. త్వరలోనే మోహ్సిన్ నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పదవి నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola