Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఉన్న టీమ్ తో ఆర్‌సీబీ వరుసగా రెండేళ్లు టైటిళ్లు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్‌సీబీ టీమ్ లో ఉన్న విదేశీ ప్లేయర్స్ కాంబినేషన్ టోర్నమెంట్‌లోనే సూపర్ అని కొనియాడారు.

"ఒకసారి వారి ఓవర్సీస్ ప్లేయర్లను చూడండి.. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకోబ్ బెథెల్.. మై గాడ్! ఇది అత్యుత్తమ కాంబినేషన్" అని అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వచ్చి, ఫిల్ సాల్ట్ ఫామ్ అందుకుంటే ఆర్‌సీబీని ఆపడం ఎవరి తరము కాదని విశ్లేషించారు. అయితే, వేలంలో 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్‌కు ఆరంభ మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కడం కష్టమని అశ్విన్ అన్నారు. 

ఒకవేళ హజెల్ వుడ్ లేకపోతే ఆ లోటును యష్ దయాల్‌తో భర్తీ చేయవచ్చని, బ్యాటింగ్‌లో జాకోబ్ బెథెల్‌ను ఆడించడం మంచిదని సూచించారు. బెథెల్ కోసం కోహ్లీ, సాల్ట్ లేదా పటీదార్‌లలో ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుందని, అలాగని బెథెల్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం సాధ్యం కాదని అన్నారు. మొత్తం మీద, ఆర్‌సీబీ యాజమాన్యం చాలా తెలివిగా వ్యవహరించిందని, టైటిల్ నిలబెట్టుకునే సత్తా ఈ జట్టుకు ఉందని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola