Ashwin On Naman Dhir Bowling Performance | నమన్ ధీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు

Continues below advertisement

భారత టీమిండియా యువ స్పిన్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కాకపోయినా, నమన్ ధీర్ తన బౌలింగ్ ట్రిక్స్ ఎంతో మెరుగుపరుచుకున్నాడని, భారత్‌కు మెయిన్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడని కొనియాడారు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నమన్ ధీర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో మూడు వికెట్లు పడగొట్టిన అతడు, మూడో టీ20లో రెండు కీలక వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

"నమన్ ధీర్ గ్రౌండ్ లో ఎంతో ఫియర్ లెస్ గా బౌలింగ్ చేస్తున్నాడు. మూడో టీ20లో షిమ్రాన్ హెట్‌మైర్ వికెట్ తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఇండోర్ గ్రౌండ్ లో పిచ్ కాస్త ఎత్తుగా, రన్‌వే ఒంపుగా ఉండే పరిస్థితుల్లో కూడా అతడు బాగా బౌలింగ్ చేశాడు" అని ప్రశంసించారు. విభిన్న పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ద్వారా అతడు వేగంగా నేర్చుకుంటున్నాడని, అతనికి నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉందని అశ్విన్ పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola