Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్

Continues below advertisement

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో అల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బెంచ్ కీ పరిమితమైయ్యాడు. అయతే నితీష్ ను ప్లేయింగ్ 11 లో సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడుతున్నారు. టీమ్ సెలక్షన్ కమిటీ, మేనేజ్‌మెంట్ పై ఫైర్ అయ్యారు. టీమ్ సెలక్షన్ లో ఎదో తప్పు జరుగుతుందని అంటున్నారు మాజీ ప్లేయర్ అశ్విన్. 

"హార్దిక్ పాండ్య లేనప్పుడు .. ప్లేయింగ్ 11 లో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయాలి. ఆలా జరగలేదు అంటే టీమ్ సెలక్షన్ లో ఎదో తప్పు జరిగింది. ప్లేయింగ్ 11 లో చోటు ఇవ్వనప్పుడు అతని సెలెక్ట్ ఎందుకు చేసారు. హార్దిక్ పాండ్య ఏదైతే చేయగలడో నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే చేయగలడు. ప్లేయింగ్ 11 లో నితీష్ కుమార్ ను సెలెక్ట్ చేయలేదు అంటే టీమ్ సెలక్షన్ నే సమీక్షించాలి " అని అన్నాడు అశ్విన్. అయితే అశ్విన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఫ్యాన్స్ కూడా సెలక్షన్ కమిటీపై మండిపడుతున్నారు. అశ్విన్ చెప్పింది నిజమే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola