Ashwin about SRH vs DC Match IPL 2026 | అక్షర్ పటేల్‌ కెప్టెన్సీపై అశ్విన్ ఫైర్

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొన్న ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తీసుకున్న నిర్ణయాలే ఆ టీమ్ ను ఓడించాయి అని అంటున్నాడు అశ్విన్. 

అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసానికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. టీమ్ లో క్వాలిటీ బౌలర్లు ఉండగా, పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన నితీష్ రాణాకు ఏకంగా 4 ఓవర్లు ఇవ్వడాన్ని అశ్విన్ తప్పుబట్టారు.

"మెయిన్ బౌలర్లు పరుగులు ఇచ్చినా పర్వాలేదు కానీ, వారి ఓవర్లను పక్కన పెట్టకూడదు. నటరాజన్ లాంటి బౌలర్లు 40 పరుగులు ఇచ్చినా వారు వికెట్లు తీయగలరు. కానీ నితీష్ రాణా 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకోవడం ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీసింది" అని అశ్విన్ విశ్లేషించారు. మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ తొలి రెండు ఓవర్లలో పరుగులు ఇచ్చినప్పటికీ, అతనికి మరో ఓవర్ ఇవ్వకపోవడం అక్షర్ చేసిన పెద్ద తప్పు అని అశ్విన్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola