Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న మెంటల్ కాన్ఫ్లిక్ట్ గురించి తొలిసారి బయటపెట్టారు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంపై కూడా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 

సీఎస్కే తరపున తాను ఆడిన చివరి సీజన్ అత్యంత భారంగా సాగిందని పేర్కొన్నారు అశ్విన్. "మరో సీజన్ ఆడే సత్తా నాకు ఉండొచ్చు, కానీ మానసికంగా ఆ ధైర్యం లేదు. ఆ స్థితి నరకం కంటే దారుణం. మళ్ళీ అటువంటి మానసిక స్థితిలోకి వెళ్లడం ఇష్టం లేకనే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

తన రిటైర్మెంట్ వల్ల సీఎస్కే యాజమాన్యానికి 10 కోట్ల రూపాయల వేలం మొత్తం మిగిలిందని కూడా అన్నాడు. అలాగే CSK వరుస ఓటములపై కూడా మాట్లాడారు. బౌలర్ల బలాన్ని నమ్మకుండా, వారి చేత కేవలం వైడ్ యార్కర్లు వేయించడం వ్యూహాత్మక తప్పిదమని విమర్శించారు. యువ ఆటగాళ్లు త్వరగా పరిస్థితిని చక్కదిద్దకపోతే, ఈ సీజన్‌లో సీఎస్కే కోలుకోవడం దాదాపు అసాధ్యమని హెచ్చరించారు. తన హోమ్ టీమ్ పట్ల అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola