పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
2025 women's ODI world Cupను గెలుచుకున్న భారత women's teamలో సభ్యురాలైన పేసర్ Arundhati Reddyకి Samshabad Airportలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Telangana) చైర్మన్ శివసేన రెడ్డితో పాటు ఇతర అధికారులు, అభిమానులు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకుని అరుంధతి రెడ్డిక ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి మాట్లాడుతూ.. తన చిన్ననాటి కల నెరవేరిందని, ప్రపంచకప్ గెలిచి ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉంటే అరుంధతి రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్టులో స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి తల్లి మాట్లాడుతూ.. ప్రపంచ కప్ భారత మహిళల జట్టు గెలవడం చాలా సంతోషం ఇచ్చిందన్నారు. తన చిరకాల కోరిక తీరిందన్నారు. ఎంతో కఠోర శ్రమ, పట్టుదలతో భారత మహిళా జట్టు టీం సభ్యులందరూ కలిసి ప్రపంచకప్ తెచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అరుంధతి రెడ్డిని చూసి తల్లి దండ్రులుగా తాము ఎంతగానో గర్వ పడుతున్నామన్నారు.
‘ప్రధాని మోదీ అంటే నాకు నాకెంతో గౌరవం. నేను ఆయనకి బిగ్ ఫాన్‌ని. అలాంటి వ్యక్తితో నా కుమార్తె మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతగానో గర్వపడ్డా. మహిళలు ప్రపంచ కప్ గెలవడం వల్ల మహిళా క్రికెట్ మరింత ముందుకు వెళుతుంది. భవిష్యత్తు క్రీడాకారులు పట్టుదలతో రాణించండి’ అన్నారామె.