Arshdeep Singh in Asia Cup 2025 | రికార్డు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న అర్షదీప్

ఆసియా కప్ 2025 యూఏఈలో ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నమెంట్ లో అందరి దృష్టి యంగ్ ప్లేయర్స్ పైనే పడింది. ముఖ్యంగా  అర్ష్‌దీప్ సింగ్‌. అందుకు కారణం టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఒక ఇంపార్టెంట్ రికార్డు బ్రేక్ చేయడానికి దేగ్గర్లో ఉన్నాడు. అర్ష్‌దీప్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 99 వికెట్లు తీసాడు. ఇంకా ఒక వికెట్ తిస్తె ఈ ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 

భారత టీ20 వికెట్ల చార్ట్‌లో అర్ష్‌దీప్ సింగ్ తర్వాత 96 వికెట్స్ తీసి యుజ్వేంద్ర చాహల్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా 94 వికెట్స్ తీసాడు. బుమ్రా 89. అంటే ఆసియా కప్ లో 100 వికెట్ల మార్క్ ను చేరుకోవడానికి హార్దిక్ పాండ్యా, అర్షదీప్ దేగ్గర్లో ఉన్నారు. ఒక వేళ ఈ ఆసియా కప్‌లోనే అర్షదీప్ 100 వికెట్ల మార్క్‌ను చేరుకుంటే, వరల్డ్ లోనే ఈ ఘనత సాధించిన నాల్గవ ఫాస్టెస్ట్ పేసర్ గా రికార్డు క్రియేట్ చేస్తాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola