Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ టీ20లో అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఒక ఓవర్ లో 13 బంతులు వేసి 18 పరుగులు ఇచ్చాడు.
మొదటి టీ20లో మంచి ప్రదర్శన కనబర్చిన అర్ష్‌దీప్ సింగ్.. రెండవ రెండో మ్యాచ్ చేతులెత్తేశాడు. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఆ ఓవర్ లో 7 వైడ్ బాల్స్ వేశాడు. 7 వైడ్‌లు, 6 లీగల్ బంతులు, అంటే మొత్తం 13 బంతుల ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చాడు.
భారత్ నుంచి ఒక ఓవర్ లో అత్యధిక బాల్స్ వేసిన బౌలర్ గా రికార్డు నమోదు చేసాడు అర్ష్‌దీప్ సింగ్ . అయితే అర్ష్‌దీప్ సింగ్ వరుసగా మూడో బంతిని వైడ్ వేసినప్పుడు.. డగౌట్‌లో కూర్చున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. వారి బంతుల్లో పరుగులు కూడా బాగా వచ్చాయి. అర్ష్‌దీప్ 4 ఓవర్లలో 54 పరుగులు, బుమ్రా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చారు.