Anil Kumble about Gambhir Coaching | గంభీర్ టీమ్ పై కుంబ్లే వ్యాఖ్యలు

మరికొద్ది రోజులో టీ20 ప్రపంచకప్ ( T20 World Cup ) టోర్నమెంట్ మొదలు కానుంది. భారత్ స్క్వాడ్ పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీ20 ప్రపంచకప్ 2024‌లో విజేతగా నిలిచిన భారత జట్టుతో పొల్చితే ప్రస్తుత టీమ్ బలంగా ఉన్నప్పటికీ, చాలా విషయాల్లో వెనుకంజలో ఉందని అన్నారు. రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పర్యవేక్షణలోని రోహిత్ సేన.. ప్రస్తుత గంభీర్ పర్యవేక్షణలో సూర్య టీమ్ కంటే గొప్పదని చెప్పుకొచ్చారు. 

'అనుభవం గురించి మాట్లాడితే టీమిండియా ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ ( Rohit Sharma ) రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక టీమ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే సూర్యసేన బలంగా ఉంది. ఎందుకంటే ఈ జట్టులో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్‌లో దూకుడైన అప్రోచ్‌తో కనిపిస్తోంది.

ఈ టోర్నీ సవాల్‌గా ఉంటుంది. 2024లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ జట్టు కంటే రోహిత్ సేన 10 శాతం ముందుందని చెబుతాను. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ తీవ్ర ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. తాజా టోర్నీ‌లో అలాంటి ప్రదర్శనలు రిపీట్ కావాలి. సూర్య ఫామ్‌లో ఉండటం ముఖ్యం. క్లిష్టపరిస్థితుల్లో అతను రాణిస్తేనే భారత్ గెలుస్తుందని గ్రహించాలి.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola